హైదరాబాద్: 28°C
వార్తలు

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపై అధికారులకు శిక్షణ

VZM: స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన దిశగా ఆర్థిక పురోగతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రత్యేక కార్యదర్శి శాంతిప్రియ పాండే అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రణాళిక శాఖ, పహలే ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జేసీ, క్షేత్రస్థాయి అధికారులకు సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.