న్యూఢిల్లీలో ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియా కార్యక్రమంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రసంగించారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ హసీనా ప్రసంగంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. హసీనాను దోషిగా తేలిన నరహంతకురాలు, సామూహిక హత్యలకు పాల్పడిన నేరస్తురాలిగా అభివర్ణించింది. భారత్ భూభాగంలో ఆమెకు మాట్లాడే అవకాశం కల్పించడం తమ సార్వభౌమత్వాన్ని అవమానించడమే అంటూ ఆరోపించింది.
వార్తలు
షేక్ హసీనాపై బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహం


