హైదరాబాద్: 28°C
వార్తలు

'రామాలయ నిర్మాణానికి సహకారం అందిస్తా'

VZM: వేపాడ మండలం వావిలిపాడు గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ సీతారామాలయాన్ని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి గురువారం సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. గ్రామస్తులు ఐకమత్యంతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని పేర్కొన్న ఆమె, ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.