ATP: అనంతపురం జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు అదనపు సహాయక ఎన్నికల నమోదు అధికారులను నియమిస్తూ భారత ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. రాయదుర్గం సహా ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఎంపీడీవోలు, అర్బన్ ప్రణాళికా అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.
వార్తలు
'జిల్లాకు అదనపు ఏఈఆర్ఓల నియామకం'


