AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ జోగినాధునిపాలెం సమీపంలో గురువారం మూడు లక్షల రూపాయల విలువైన డిఫెన్స్ మద్యాన్ని పట్టుకున్నట్లు ఎక్సైజ్ సిఐ సునీల్ కుమార్ తెలిపారు. వజ్రగడ గ్రామానికి చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తి డిఫెన్స్ మద్యాన్ని కారులో తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. కారులో 8 రకాల బ్రాండ్లకు చెందిన 44 బాటిల్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.
వార్తలు
డిఫెన్స్ మద్యం పట్టివేత


