హైదరాబాద్: 28°C
వార్తలు

'జీవోలు రద్దు చేయాలి'

ASR: సీఎం ఇచ్చిన హామీ మేరకు జీవో నెం.3కు ప్రత్యామ్నాయ ఆర్డినెన్స్ జారీ చేసి, ఆదివాసులకు 100శాతం ఉద్యోగాలు కల్పించాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అరకు మండలం లోతేరులో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈనెల 8న జరగనున్న బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. హైడ్రో ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలను రద్దు చేయాలని కోరారు.