హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలి: కలెక్టర్

WNP: జిల్లాలో ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరి సాగుపై ఆధారపడకుండా వేరుశెనగ, ఆయిల్ పామ్, ఉల్లి, కూరగాయలు, కంది, మినుములు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో పంటల మార్పిడిపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టి రైతులకు శాస్త్రీయ సలహాలు అందించాలన్నారు.