ASR: ఈనెల 8న జరగనున్న మన్యం బంద్‌ను విజయవంతం చేయాలని బుధవారం పాడేరు మండలం గుత్తులపుట్టు వారపు సంతలో గిరిజన సంఘం, ఏపీ గిరిజన సమాఖ్య నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. జీవో నెం.3పై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. 1/70 చట్టానికి భంగం కలిగిస్తే సహించబోమని హెచ్చరించారు. మన్యం ప్రాంత ప్రజలందరూ బంద్‌కు మద్దతు తెలిపి విజయవంతం చేయాలన్నారు.
వార్తలు
'బంద్‌కు మద్దతు తెలపాలి'


