హైదరాబాద్: 28°C
వార్తలు

నాగులపాలెంలో సంక్షేమ పథకాలపై అవగాహన

BPT: పర్చూరు (మం) నాగులపాలెంలో గురువారం టీడీపీ నాయకులు "రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి,సంక్షేమం" కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలందరూ సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.