హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురువారం బోగోలు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని కోవూరుపల్లి గ్రామంలో రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.