హైదరాబాద్: 28°C
వార్తలు

పెన్ అండ్ పేపర్ విధానానికి స్వస్తి: కేంద్రం

NEET-UG పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. 'పెన్ అండ్ పేపర్' విధానానికి స్వస్తి చెబుతామని కేంద్రం పేర్కొంది. ఆన్‌లైన్ పరీక్షపై సమాలోచనలు జరుపుతున్నామని తెలిపింది. జేఈఈ తరహాలో నీట్ నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది. కేంద్రం అఫిడవిట్‌పై పిటిషనర్ల సమాధానాలను కోరుతూ.. విచారణను 19కి వాయిదా వేసింది.