హైదరాబాద్: 28°C
వార్తలు

హరీష్‌రావుపై నేను అబద్దాలు చెప్పలేదు: TPCC చీఫ్

TG: మాజీమంత్రి హరీష్ రావుపై తాను అబద్ధాలు చెప్పలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఏమైనా ఉంటే న్యాయస్థానంలోనే తేల్చుకుందామని అన్నారు. లీగల్ నోటీసులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే బీజేపీ నేత ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ 'అరవింద్ మాటలు నీటి మూటలు' అని విమర్శించారు. తన ముందు అరవింద్, బండి సంజయ్ పిల్లలతో సమానమని వ్యాఖ్యానించారు.