హైదరాబాద్: 28°C
వార్తలు

జైల్ భరోను విజయవంతం చేయాలి: సీఐటీయూ

MDK: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. తూప్రాన్ పట్టణంలో జైల్ భరో ప్రచార కరపత్రాన్ని విడుదల చేసిన ఆయన, సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు.