హైదరాబాద్: 28°C
వార్తలు

తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు శిక్ష

తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించింది. 2013 నాటి లైంగిక దాడి కేసులో 2021లో లోయర్ కోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పును కొట్టివేస్తూ.. తాజాగా హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి శిక్షను ఖరారు చేసింది. కాగా, 2013లో తన వద్ద పనిచేసే ఓ మహిళా జర్నలిస్ట్‌పై హోటల్ లిఫ్ట్‌లో ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడు.