Viral: పొలాలకు వెళ్తున్న మహిళా రైతుపై 15 అడుగుల కొండచిలువ దాడి కలకలం రేపింది. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కంచన్‌పల్లికి చెందిన స్వప్నపై కొండచిలువ దాడి చేసి మింగేందుకు ప్రయత్నించింది. ఆమె కేకలు విన్న రైతులు, కూలీలు వెంటనే స్పందించి పామును తరిమివేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం పామును సంచిలో బంధించి, స్వప్నను జనగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.
వార్తలు
రైతుపై కొండచిలువ దాడి


