SKLM: డీఎస్సీ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు పొన్నాడ బ్రిడ్జి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. డీఎస్సీని రద్దు చేసి పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
'ప్రభుత్వమే బాధ్యత వహించాలి'


