హైదరాబాద్: 28°C
వార్తలు

చెరువుల పరిరక్షణ ధర్నా

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే పార్కు వద్ద చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం జరుగుతున్న స్వచ్ఛంద ధర్నా రెండవ రోజు గురువారం కొనసాగింది. ఈ సందర్భంగా ఉద్యమ నాయకుడు మల్లేశ్వరావు మాట్లాడుతూ.. చెరువులపై ఆక్రమణలు తొలగించి హద్దులు గుర్తించాలని డిమాండ్ చేశారు. చెరువులు రైతుల జీవనాధారం, భావితరాల ఆస్తి అని పేర్కొన్నారు.