హైదరాబాద్: 28°C
వార్తలు

అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం

రాజ్యసభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విద్యార్థులపై లాఠీఛార్జ్‌పై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు చర్చకు సిద్ధంగా ఉన్నాయని చెప్పాయి. అయితే ఈ చర్చ కోసం కేంద్రమంత్రి అమిత్ షా సభకు రావాలని పట్టుబట్టాయి. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పందిస్తూ విపక్షం మాకు ఆదేశాలు ఇవ్వొద్దు అంటూ కౌంటర్ ఇచ్చారు.