హైదరాబాద్: 28°C
వార్తలు

గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు మృతి

గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యూపీ ఝాన్సీ-కాన్పూర్ హైవేపై అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అబాన్ అహ్మద్‌ను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు.