హైదరాబాద్: 28°C
వార్తలు

రష్యా చమురు కొనుగోళ్లలో భారత్ రికార్డ్

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా సరికొత్త రికార్డు సృష్టించింది. కెప్లర్ ఏజెన్సీ నివేదిక ప్రకారం, జులై నెలలో భారత్ కొనుగోలు చేసిన మొత్తం ముడిచమురులో 55 శాతం రష్యా నుంచే దిగుమతి అయింది. ఇది రోజుకు 2.6 మిలియన్ బ్యారెళ్లకు సమానం. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ నడుమ రష్యా బ్యారెల్‌పై 2 నుంచి 3 డాలర్ల డిస్కౌంట్ ఇవ్వడం భారత రిఫైనరీలకు భారీ ఊరటనిచ్చింది.