హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాలతో కళకళలాడుతున్న కొబ్బరి తోటలు

KKD: తొండంగి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో కొబ్బరి తోటలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. తగినంత తేమ అందడంతో చెట్లు ఆరోగ్యంగా పెరుగుతుండటంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి చెట్లకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో ఈ సీజన్‌లో మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.