హైదరాబాద్: 28°C
వార్తలు

కనకమహాలక్ష్మి అమ్మవారి పండుగ వైభవం

AKP: బంగారుమెట్ట గ్రామంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి పండుగను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి భారీగా చేరుకున్న భక్తులు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. బంగారుమెట్ట, ఎల్బిపురం గ్రామాల నుంచి ఘటాలతో ఊరేగింపుగా వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.