ఈ20 పెట్రోల్‌తో వాహనాల ఇంజిన్లు తుప్పు పడుతున్నాయంటూ కేంద్రానికి రాసిన లేఖను వాహన తయారీదారుల సమాఖ్య సియామ్ ఉపసంహరించుకుంది. లేఖలోని గణాంకాలపై అదనపు ధ్రువీకరణ, దేశవ్యాప్తంగా మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా, ఈ20లో క్లోరైడ్, తేమతో ఇంజిన్లు దెబ్బతింటున్నాయని సియామ్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
E20 పెట్రోల్‌పై సియామ్ లేఖ వెనక్కి


