హైదరాబాద్: 28°C
వార్తలు

వేతనాల కోసం నిరసన..!

NTR: మైలవరం(M) చండ్రగూడెం గ్రామపంచాయతీ కార్మికులకు ఎనిమిది నెలలుగా, ట్యాప్ వర్కర్లకు పది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై సీఐటీయూ ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్ సుధాకర్ మాట్లాడుతూ కలెక్టర్ వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.