అరుణాచల్ ప్రదేశ్ అప్పర్ సియాంగ్ జిల్లాలో రెండు స్వల్ప భూకంపాలు సంభవించాయి. తొలుత 5.1తో భూప్రకంపనలు రాగా కొద్ది నిమిషాల వ్యవధిలో మరోసారి 3.5 తీవ్రతతో భూకుదుపులు వచ్చాయి. భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
వార్తలు
అరుణాచల్ ప్రదేశ్‌లో స్వల్ప భూకంపాలు


