GNTR: మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి సందర్భంగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాసేవలో జక్కంపూడి చూపిన చొరవను, వైఎస్సార్ కుటుంబంతో ఆయనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో లేళ్ల అప్పిరెడ్డితో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.
వార్తలు
జక్కంపూడి రామ్మోహన్‌రావుకు జగన్ నివాళి


