VZM: హస్తకళల ప్రోత్సాహానికి ప్రభుత్వం సాంకేతికతను జోడిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ సూచన మేరకు దేశంలో తొలిసారిగా హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ విధానాన్ని‘లేపాక్షి’ ఆధ్వర్యంలో ప్రారంభించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కళాఖండం చరిత్ర, సాంస్కృతిక విశిష్టత, తయారీ విధానం, రూపొందించిన కళాకారుడి పేరు వంటి పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.
వార్తలు
హస్తకళలకు క్యూఆర్ కోడ్


