హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బ్రాడీపేటలో నేలకొరిగిన భారీ చెట్టు!

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని బ్రాడీపేట 2/12వ లైన్‌లో ఓ భారీ చెట్టు నేలకొరిగింది. ప్రధాన రహదారికి అడ్డంగా చెట్టు పడిపోవడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో చెట్టు కింద నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే అధికారులు స్పందించి తొలగింపు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.