AP: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైసీపీ ధర్నాను ఎమ్మెల్యే బొండా ఉమా అడ్డుకున్నారు. ధర్నా చౌక్ వదిలి ప్రజలను ఇబ్బంది పెట్టేలా వైసీపీ చర్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు. తమ వర్గంతో ఉమా వైసీపీ టెంట్లను తొలగించడంతో ఆ ప్రాంతంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలు చెదరగొట్టారు.
వార్తలు
వైసీపీ, బొండా ఉమా వర్గీయుల మధ్య తోపులాట


