సోషల్ మీడియా దిగ్గజం 'మెటా'పై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో తన ఖాతాను ఎందుకు నియంత్రించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఇక్కడి మెటా అధికారులను ప్రశ్నించినా, ఈమెయిల్స్ పంపినా సరైన స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రతిపక్షాల గొంతు నొక్కవద్దని ఆయన విమర్శించారు.
వార్తలు
మెటా సంస్థపై కేజ్రీవాల్ ఫైర్


