హైదరాబాద్: 28°C
వార్తలు

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

యూపీలో దారుణం చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లా మహౌలి వార్డులో సుమారు 100 ఏళ్ల నాటి ఇల్లు కుండపోత వర్షానికి ఒక్కసారిగా కూలింది. దీంతో ఆ శిథిలాల కింద చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. తెల్లవారుజామున 3 గంటలకు కుటుంబమంతా నిద్రిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.