HNK: ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా హన్మకొండ బాలసముద్రంలోని ఆయన స్మృతివనంలో గురువారం ఆర్ట్స్ కళాశాల వాకర్స్, తెలంగాణ వాదులు ఘనంగా నివాళులర్పించారు. జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, యువత ఆయన ఆశయసాధనకు కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు.
వార్తలు
'జయశంకర్ ఆశయసాధనకు కృషి చేయాలి'


