హైదరాబాద్: 28°C
వార్తలు

వి. రెడ్డిపాలెం ఆర్‌బీకే కేంద్రంలో విషసర్పం కలకలం

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలెం రైతు భరోసా కేంద్రంలో గురువారం విషసర్పమైన జర్రిపోతు కనిపించడంతో కలకలం రేగింది. పామును గమనించిన స్థానికులు వెంటనే పాములు పట్టే వీరలంకయ్యకు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని సమీపంలోని ముళ్ల పొదల్లో వదిలిపెట్టారు. దీంతో అక్కడి సిబ్బంది, రైతులు ఊపిరి పీల్చుకున్నారు.