హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే మృతి

యూపీ రస్రా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడించారు. రస్రా నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలుగా ఉమా శంకర్ బీఎస్పీ అభ్యర్థిగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుత యూపీ అసెంబ్లీలో ఈయనే ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే కావడం విశేషం.