హైదరాబాద్: 28°C
వార్తలు

జలాశయంలో 0.06 TMCల నీటిమట్టం

MBNR: జిల్లాలో మధ్యతర సాగునీటి ప్రాజెక్టు అయిన కోయిల్ సాగర్ జలాశయంలో ప్రస్తుతం 0.06 టిఎంసిల నీటి నిలువ ఉన్నట్టు ఈఈ ప్రతాప్ సింగ్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 2.23 TMCలు అని పేర్కొన్నారు. ప్రస్తుతం జూరాల నుండి ఎత్తిపోతుల ద్వారా ప్రాజెక్టులోకి నీరు వస్తున్నట్లు తెలిపారు. వర్షపు నీరు కూడా భారీగా చేరుతుందన్నారు.