హైదరాబాద్: 28°C
వార్తలు

గంజాయి సేవిస్తున్న ఇద్దరి అరెస్టు

MHBD: నెల్లికుదురు మండలం దుర్గాభవానీ తండా మలుపు సమీపంలో గంజాయి సేవిస్తున్న ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆలేరుకు చెందిన దిడ్డి కార్తీక్, కేవులా తండాకు చెందిన బాదావత్ మోహన్‌కు పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయిందని ఎస్సై చిర్రా రమేష్‌బాబు తెలిపారు. అనంతరం వారిని తొర్రూరు న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు వెల్లడించారు.