ములుగు పట్టణంలోని ప్రేమనగర్ సమీపంలో జాతీయ రహదారిపై చెత్త సేకరిస్తున్న మున్సిపాలిటీ ట్రాక్టర్‌ను ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్ వద్ద కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ రోడ్డుపై అడ్డంగా పడిపోగా, లారీ పొలాల్లోకి దూసుకెళ్లి ఆగింది. దీంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వార్తలు
లారీ ఢీకొట్టడంతో రోడ్డుపై బోల్తాపడిన మున్సిపల్ ట్రాక్టర్


