రాజ్యసభ ఎంపీలతో సమావేశంలో ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు. సభకు 100 శాతం హాజరయ్యేలా చూసుకోవాలని, ప్రతిపక్ష నేతల నుంచి కూడా మంచి విషయాలు నేర్చుకోవాలని సూచించారు. రోజూ 1 నుంచి 2 గంటలు లైబ్రరీలో గడపాలని చెప్పారు. యువతతో మమేకం కావాలని, అలాగే ఎంపీ లాడ్స్ నిధులను తమ నియోజకవర్గాల్లో క్రీడలు, యువత కార్యకలాపాల కోసం ఎక్కువగా వెచ్చించాలని ప్రధాని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
వార్తలు
విపక్షాల నుంచి నేర్చుకోండి: మోదీ


