MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు సర్పంచ్ ఉల్లి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పట్టణ వీధిలలో ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. దోమల నివారణతో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని సర్పంచ్ తెలిపారు.
వార్తలు
VIDEO: సీజనల్ వ్యాధుల నివారణకు ఫాగింగ్ నిర్వహణ


