హైదరాబాద్: 28°C
వార్తలు

8 సెకన్లలోనే నిద్రపోతా: మోదీ

కొత్తగా ఎన్నికైన 37 మంది ఎన్డీయే రాజ్యసభ ఎంపీలతో ప్రధాని మోదీ అల్పాహార విందులో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన దినచర్యను పంచుకున్నారు. తాను పడుకోవడానికి ఉపక్రమించిన 8 సెకన్లలోనే నిద్రపోతానని, రోజుకు 3 గంటలే నిద్రపోతానని చెప్పారు. ఉత్తమ ఫలితాలు సాధించాలంటే వర్తమానంలో జీవించాలని సూచించారు. కొత్త ఎంపీలలో ఆప్ నుంచి వచ్చిన వారితో పాటు నితిన్ నబీన్ కూడా ఉన్నారు.