సత్యసాయి జిల్లా కేంద్రంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నూతన భవన నిర్మాణానికి రూ. 3 కోట్ల నిధులు మంజూరు చేయాలని హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి కోరారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు వినతిపత్రం సమర్పించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణకు ఈ భవనం ఉపయోగపడుతుందని వివరించారు.
వార్తలు
కేంద్రమంత్రికి హిందూపురం ఎంపీ వినతి


