హైదరాబాద్: 28°C
వార్తలు

'జగన్ భద్రత విషయంలో కుట్ర జరిగింది'

AP: జగన్ భద్రత విషయంలో కుట్ర జరిగిందని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు లేకుండా చేయాలని కుట్రపన్నారని వ్యాఖ్యానించారు. హెలిప్యాడ్ దగ్గర భద్రత లోపించిందన్నారు. జగన్ పర్యటనకు రైతుల నుంచి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. పొగాకు రైతులను కూటమి నేతలు అవమానించారని మండిపడ్డారు. కూటమి నేతలు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.