హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికా రాయబారితో సీఎం రేవంత్ భేటీ

TG: అమెరికా రాయబారి సెర్జియోగోరోతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో విద్య, ఉపాధి, పెట్టుబడుల్లో సహకారం బలోపేతం చేయాలని సీఎం ప్రస్తావించారు. అమెరికాకు వెళ్లే రాష్ట్ర విద్యార్థులకు వీసాలు పెంచండని కోరారు. విద్యార్థులకు వీసా అపాయింట్‌మెంట్లు సకాలంలో ఉండేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచి దరఖాస్తుల పరిశీలన వేగంగా చేయాలన్నారు.