హైదరాబాద్: 28°C
వార్తలు

‘స్టాప్ - వాష్ అండ్ గో’ కార్యక్రమం

NDL: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతే లక్ష్యంగా నంద్యాల జిల్లా పోలీసులు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమాన్ని ప్రతిరోజూ నిర్వహిస్తున్నారు. రాత్రివేళ వాహనాలను నిలిపి విస్తృత తనిఖీలు చేపడుతూ.. డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి సహకరించాలని జిల్లా పోలీసు కార్యాలయం తెలిపింది.