హైదరాబాద్: 28°C
వార్తలు

రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. బుధవారం నేరాల నియంత్రణకు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేస్తూ.. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నారు.