యూపీలోని బారాబంకిలో మూఢనమ్మకాలు ఓ మహిళ ప్రాణం తీశాయి. అనారోగ్యంతో బాధపడుతున్న 33 ఏళ్ల మహిళను ఆసుపత్రికి కాకుండా బాబా దగ్గరకు తీసుకెళ్లారు. దుష్టశక్తులు ఆవహించాయంటూ పది రోజులు స్తంభానికి కట్టేసి పూజలు చేశారు. దీంతో ఆమెకు ఆహారం అందక ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో మృతి చెందింది. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు భర్త, బాబాతో పాటు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు.
వార్తలు
చికిత్స పేరుతో.. 10రోజులు స్తంభానికి కట్టేసి!


