హైదరాబాద్: 28°C
వార్తలు

చదువే విజయానికి పునాది: మాజీ ఎమ్మెల్యే

RR: కేశంపేట మండలం పాటిగడ్డ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో KLR ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారిని అభినందించారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని, ప్రతి విద్యార్థి లక్ష్యసాధనకు కృషి చేయాలని సూచించారు.