హైదరాబాద్: 28°C
వార్తలు

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

ADB: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. బేల తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఈ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు.