హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ద్వారకచర్లలో ఇంద్రధనస్సు కనువిందు

ప్రకాశం: కోమరోలు (మం) ద్వారాకచర్లలో బుధవారం సాయంత్రం వర్షం అనంతరం ఆకాశంలో వెలిసిన అందమైన ఇంద్రధనస్సు గ్రామస్తులను ఆకట్టుకుంది. ప్రకృతి సోయగాన్ని ఆస్వాదించిన స్థానికులు ఈ అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఆకాశాన్ని రంగురంగుల వర్ణాలతో అలంకరించిన ఇంద్రధనస్సు గ్రామ పరిసరాలకు మరింత అందాన్ని తీసుకువచ్చింది.