PLD: ముప్పాళ్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కేవి. శివప్రసాద్ అధ్యక్షతన ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం జరిగింది. తోటల పెంపకం, కూలీల హాజరు, ప్రాధాన్య పనులపై చర్చించారు. పండ్ల తోటల రైతులు దరఖాస్తు చేసుకోవాలని, భూగర్భ జలాల కోసం పొలాల్లో ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో ఏపీవో ఏడుకొండలు, ఈసీ కృష్ణకుమారి పాల్గొన్నారు.
వార్తలు
ఉపాధి పనులపై ఎంపీడీవో సమీక్ష


